ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ ప్రారంభించనున్న బాబీ
- February 20, 2017 / 06:57 AM ISTByFilmy Focus
నందమూరి అభిమానులను ఊరిస్తున్న ఎన్టీఆర్ 27 సినిమా మొదలైపోయింది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు నిర్వహించిన తారక్ కొత్త చిత్రం నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. అయన లేకుండా ఎందుకు షూటింగ్ ప్రారంభించారని ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయటపడింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషించనున్నారు. ఎన్టీఆర్ నటనలో వేరియేషన్స్ మాత్రమే కాకుండా బాడీలోను మార్పులు కనిపించాలని హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తీసుకున్నారు.
అతనితో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లుక్ డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. హార్ట్ వెల్ ఎన్టీఆర్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుని అమెరికాలో స్టూడియోకి వెళ్లారు. ఇంకా తుది రూపు పూర్తికాలేదు. కొన్ని రోజులు ఆలస్యం అయ్యేట్టు ఉంది. అది తెలుసుకున్న డైరక్టర్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు. “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















