ఎన్టీఆర్, బాబీ సినిమాలో ఖరారైన ముగ్గురు హీరోయిన్లు
- February 11, 2017 / 02:04 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా నిన్న వైభవంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, కెమెరా మెన్ గా సీ కే మురళీధరన్ ని ఎంపిక చేశారు. ఇక ఎన్టీఆర్ రూపాల్లో వైవిద్యం కనిపించాలని హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ను బాబీ తన టీమ్ లోకి తీసుకున్నారు. విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ ఎన్టీఆర్ తో తలపడనున్నారు.
“జై లవ కుశ” అనే పేరును పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పక్కన నటించే ముగ్గురు ముద్దుగుమ్మలను ఫిక్స్ చేశారు. ఇదివరకే ఢిల్లీ సుందరి రాశీఖన్నాను సెలక్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా మిగిలిన ఇద్దరు హీరోయిన్లను ఖరారు చేసింది. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా లు ఎన్టీఆర్ 27 మూవీలో నటించనున్నారని సమాచారం. ఈ విషయం రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















