టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నుండి చివరిగా వచ్చిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా తరువాత నుండి ఎన్టీఆర్ తన పూర్తి సమయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ కోసమే కేటాయిస్తున్నాడు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలనుకున్నారు కానీ వర్కవుట్ అవ్వలేదు. కరోనా కారణంగా సినిమా మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ నుండి బయటకి రానున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ కోసం చాలా కష్టపడినప్పటికీ.. తన తదుపరి సినిమా మొదలుపెట్టడానికి ముందు ఎన్టీఆర్ ఎలాంటి బ్రేక్ తీసుకోవడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం చాలా సమయం పట్టడంతో.. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఎలాంటి బ్రేక్ తీసుకోకూడదని భావిస్తున్నాడట. ఈ సినిమాను మరో నెల రోజుల్లోపే మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను జరపనున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొంటారట. మే నెల మొత్తం త్రివిక్రమ్ సినిమా కోసం అతడు కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించనున్నారు. డిసెంబర్ నాటికి సినిమాను పూర్తి చేసి కొత్త ఏడాదిలో ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టాలనేది ఎన్టీఆర్ ప్లాన్. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!