రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఈ చిత్రంలో హీరో చరణ్ కు జోడీగా నటించబోతున్న హీరోయిన్ అలియా భట్, అలాగే ప్రత్యేక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగన్ వంటి వారు కరోనా భారిన పడటంతో తాత్కాలికంగా వాయిదా పడింది. సెట్లో కూడా కొంతమంది యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట.
మరో పక్క ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే త్రివిక్రమ్ కూడా కరోనా భారిన పడ్డాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. తారక్ నటించాల్సిన సినిమాలకే కాదు.. బుల్లితెర షోకి కూడా కరోనా టెన్షన్ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ హోస్ట్ గా త్వరలో జెమినీ టీవీలో‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షో ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా టెలికాస్ట్ అవుతున్నాయి.
నిజానికి మే 3వ వారం నుండీ ఈ షోని టెలికాస్ట్ చెయ్యాలని జెమినీ వారు ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆ షోకి సంబంధించిన షూటింగ్ ను కూడా నిర్వహించే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదట. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన వారిలో కొంతమంది కరోనా భారిన పడినట్టు వినికిడి.దాంతో ఈ రియాలిటీ షో వాయిదా పడనుంది అని సమాచారం.
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!