Sonali Joshi: ఒకప్పటి హీరోయిన్ సోనాలి జోషి ఇప్పుడెలా ఉందో చూడండి..!

ఇదివరకు ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్లు ఎవరు ఏమైపోయారో ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అందరి వివరాలు ఏదో ఒక రకంగా తెలుస్తున్నాయి. హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువ కాబట్టి.. వాళ్లకి ఓ హిట్ పడి క్రేజ్ వస్తే ఎంత సర్దుకుందామా అని వారు భవిస్తూ ఉంటారు. అందుకోసం వచ్చిన ప్రతీ ఆఫర్ ను ఫైనల్ చేసేసి అందులో నటిస్తూ ఉంటారు. ఆ సినిమాలు హిట్ అయితే ఓకే.. కానీ ప్లాప్ అయితే.. వాళ్ళ అడ్రెస్ గల్లంతు అవుతుంది.

సరిగ్గా ఈ ఎన్టీఆర్ హీరోయిన్ పరిస్థితి అలాగే అయ్యింది. ఎవరా ఎన్టీఆర్ హీరోయిన్ అనుకుంటున్నారా? సోనాలీ జోషి. ఈ పేరు వినడానికి కొత్తగానే ఉంటుంది. కానీ ఈమె మన ఎన్టీఆర్ కు జోడీగా ఓ సినిమాలో నటించింది. వివరాల్లోకి వెళితే.. 2001 వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా సురేష్ వర్మ దర్శకత్వంలో ‘సుబ్బు’ అనే మూవీ వచ్చింది. ‘స్టూడెంట్ నెంబర్1’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండీ వచ్చిన మూవీ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

ఇక చిత్రంలో హీరోయిన్ గా సోనాలీ జోషి నటించింది. సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. తర్వాత ‘సందడే సందడి’, ‘నాన్న నేను అబద్ధం’ ‘రాంబాబు గాడి పెళ్ళాం’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి కూడా నిరాశపరచడంతో ఈమె సినిమాలకు దూరం అయ్యింది.అయితే ఈమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరాలు అవుతుంది. ఆ ఫోటో చూసిన వారంతా షాక్ కు గురవుతూన్నారు. ఎందుకంటే ఆ ఫొటోలో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus