మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.ఇందులో రవితేజ మాస్ లుక్, డైలాగులు, ఆకట్టుకున్నాయి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. స్టూవర్టుపురం లో అన్యాయానికి గురైన ఓ సాధారణ మనిషి బందిపోటు దొంగగా మారి ఎందుకు దొంగతనాలు చేశాడు అనే లైన్ తో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి కథలు చిన్నప్పటి నుండి మనం చాలానే చూస్తూ వచ్చాము.
అయితే ఆ కథలకి స్ఫూర్తి ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇతన్ని చాలా మంది రాబిన్ హుడ్ తో పోలుస్తారు. అప్పట్లో ప్రధాన మంత్రికి కూడా వణుకు పుట్టించిన వ్యక్తి అని ఈ స్టూవర్టుపురం దొంగ గురించి చెప్పుకుంటారు. అంతేకాదు.. రన్నింగ్ ట్రైన్ తో సమానంగా పరిగెత్తి మరీ దొంగతనాలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. అందుకే ‘టైగర్ నాగేశ్వరరావు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులోనే కాదు హిందీలో కూడా అంచనాలు భారీగా పెరిగాయి.
ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది నుపుర్ సనన్. ఈమె మరెవరో కృతి సనన్ చెల్లెలు. ఆమె తెలుగులో మహేష్ బాబు తో వన్ , నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ ఆదిపురుష్ వంటి పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి ఆడలేదు.అయితే ప్రభాస్ తో పెళ్లి వార్తలతో ఈమె ఎక్కువ హాట్ టాపిక్ అయ్యింది. ఇది పక్కన పెడితే..
కృతి సనన్ (Nupur Sanon) ట్రాక్ రికార్డ్ చూసి ఆమె చెల్లెలు నుపుర్ సనన్ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నావ్? అని ప్రశ్నించగా ఆమె ‘ మా అక్క నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు కానీ అవి చాలా మంచి సినిమాలు. బాక్సాఫీసు నంబర్స్ తో హీరోయిన్లకి పనేమిటి ‘ అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు