Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

‘దేవీ పుత్రుడు’ ‘ప్రేమతో రా’ వంటి ప్లాపులతో సతమతమవుతున్న విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేశారు. ఈ సినిమా ద్వారా గుజరాతీ భామ, దివంగత ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి రైటర్ గా పనిచేశారు. ఆయన పెన్ నుండి వచ్చిన ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ అని చెప్పాలి.

24 Years For Nuvvu Naaku Nachav

‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న శ్రీ స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కోటి సంగీత దర్శకుడు. 2001 సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పెద్దగా హడావిడి లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. మౌత్ టాక్ తోనే క్రమ క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సెప్టెంబర్ 6తో ‘నువ్వు నాకు నచ్చావ్’ రిలీజ్ అయ్యి 24 ఏళ్ళు పూర్తి కావస్తోంది. చాలా మంది అభిమానులతో పాటు హీరో వెంకటేష్ కూడా ఈ సినిమా రీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.10 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 1.87 cr
ఈస్ట్ 1.36 cr
వెస్ట్ 1.13 cr
గుంటూరు 1.67 cr
కృష్ణా 1.27 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 16.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.14 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.04 cr

 

‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం రూ.7.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.18.04 కోట్లు కలెక్ట్ చేసింది. రూ.10, రూ.25 టికెట్ రేట్లతోనే ఈ సినిమా అంత వసూల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. బయ్యర్లకు రూ.10.8 కోట్ల భారీ లాభాలు అందించింది. ఒకవేళ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి

మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus