సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక విలువ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కథను ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగ పడుతాయి. కొన్ని పాత్రలు స్టోరీలో ట్విస్ట్ ఇస్తాయి. ఇలా మనుషులే కాదు.. కొన్ని వస్తువులు కూడా కథను మలుపు తిప్పుతాయి. అటువంటి వస్తువులపై ఫోకస్…
1 . ఖుషి (దీపం)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి బ్లాక్ బస్టర్ హిట్. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరో, హీరోయిన్ కలిసే సీన్ కీలకం. ఇందుకు కారణం ఒక దీపం. ఈ దీపం ఆరిపోతూ.. కథకి వెలుగునిచ్చింది. ఈ దీపం ఆరిపోకుండా పవన్ కళ్యాణ్, భూమిక చెయ్యి అడ్డుపెట్టడంతో ప్రేమ కథ మొదలవుతుంది.
2 . అతడు (గోలి)మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా ఫోన్ నుంచి “అతడు”లో ప్రతి ఒక సీన్ కి లాజిక్ ఉంటుంది. క్లైమాక్స్ లో హీరో మహేష్ బాబు తలపై విలన్ సోనూసూద్ గన్ పెట్టి కాల్చినా విలనే చనిపోతాడు. అందుకు కారణం గోలీ. పిల్లలు ఆడుకుంటూ గన్ లోకి గోళీని వదిలేస్తారు. అదే హీరోని బతికిస్తుంది.
3 . ఛత్రపతి (చెంబు)దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కాట్ రాజ్ ని కొట్టే సన్నివేశంలో కంట్లో మట్టి పడడంతో ఇబ్బంది పడుతాడు. అక్కడ ఛత్రపతి తడుముకోగా చెంబు దొరుకుతుంది. అందులోని నీళ్లతో ముఖం కడుక్కొని కాట్ రాజ్ ని చిత్తుచేస్తాడు. ఆ చెంబు హీరోకి సహాయం చేస్తుంది.
4 . శివ (సైకిల్ చైన్ ) కింగ్ నాగార్జున కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రం శివ. రామ్ గోపాల వర్మ డైరక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో స్టోరీని మలుపు తిప్పిన వస్తువు ఉంది. అదే సైకిల్ చైన్. ఒంటరిగా, చేతిలో ఆయుధం లేకుండా ఉన్న సమయంలో విలన్లు శివపైకి దాడికి వస్తుంటే ఈ సైకిల్ చైన్ ఆయుధమవుతుంది. శివని హీరోని చేస్తుంది.
5 . బాహుబలి బిగినింగ్ (మాస్క్)బాహుబలి చిత్రంలో శివ(ప్రభాస్) కి అవంతిక(తమన్నా) మాస్క్ దొరకడం వల్లే జలపాతాన్ని ఎక్కాలని కోరిక బలపడుతుంది. కొండ ఎక్కిన తర్వాతే శివకి తాను మహేంద్ర బాహుబలి అని తెలుస్తుంది. కాబట్టి బాహుబలి చిత్రంలో మాస్క్ కూడా కీలకమే.
6 . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (ఇడ్లీ) వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో వందో తప్పు చేయకూడదని ఎంతో జాగ్రత్తగా ఉన్న సందీప్ ని అష్టకష్టాలు చేసింది ఎవరో గుర్తుందా?.. ఇడ్లీ. అవునండీ సందీప్ రైల్వే స్టేషన్లో అభిమానంతో టిఫిన్ సెంటర్ వ్యక్తి ఇచ్చిన ఇడ్లీని తినకుండా ఉంటే అసలు ఇంత కథ జరిగేదే కాదు. అందుకే ఈ చిత్రంలో ఇడ్లీ కీలక పాత్రధారి అయింది.
7 . దేవుడు చేసిన మనుషులు (అరటి తొక్క) డిఫెరెంట్ కాన్సెప్ట్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో అరటి తొక్క కీలకం. స్టోరీలో తొక్క ట్విస్ట్ ఇచ్చింది. అరటికాయ తొక్కపైన కాలు వేసి జారడం వల్ల కథ ఎలా మారిపోతుందో ఇందులో బాగా చూపించారు.
8 . పెళ్లి చూపులు ప్రశాంత్, చిత్ర అనే ఇద్దరు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి పెళ్లిచూపులు చిత్రంలో డోర్ సహాయం చేస్తుంది. ఆ డోర్ లాక్ కాకపోతే స్టోరీ వేరేలా ఉండేది. అందుకే ఈ సినిమాలో తలుపు ప్రధాన పాత్ర దారి అయింది.