దసరా, దీపావళి.. రెండూ అక్టోబర్ నెలలోనే వచ్చాయి. ఈ నెలలలో దాదాపు 40 సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిన్న, మిడ్ రేంజ్, డబ్బింగ్ .. వంటి సినిమాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘శ్వాగ్’ (Swag) ‘విశ్వం’ (Viswam) ‘మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) : ‘ ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) ‘వేట్టయన్’ (Vettaiyan) ‘పొట్టేల్’ ‘లక్కీ భాస్కర్’ ‘క’ ‘అమరన్’ వంటి క్రేజీ సినిమాలు ఈ నెలలో రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో హిట్ సినిమాలు ‘క'(KA) ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar) ‘అమరన్’ (Amaran) మాత్రమే అని చెప్పాలి.
‘విశ్వం’ ‘వేట్టయన్’ వంటి సినిమాలు యావరేజ్ అనిపించాయి. మిగిలినవి ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేదు అనే చెప్పాలి. సాధారణంగా అక్టోబర్ అనేది అన్ సీజన్ అంటుంటారు. కానీ పండుగల టైంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.అయితే ఒక పెద్ద సినిమా వాళ్ళకి ఆప్షన్ గా ఉండాలి. ఈసారి ఆ అడ్వాంటేజ్ ‘దేవర'(Devara) తీసుకుంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది.
కానీ అభిమానులు, మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు అందులో ఉన్నాయి. అందువల్ల ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమా పక్కన రిలీజ్ అయిన చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు నిలబడలేకపోయాయి అని స్పష్టమవుతుంది. ఏదేమైనా అక్టోబర్ నెల ఓపెనింగ్ సో సో గానే ఉంది. కానీ ‘లక్కీ భాస్కర్’ ‘క’ ‘అమరన్’ వంటివి ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాయని చెప్పాలి. మరి నవంబర్ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుందో..!