Odela Railway Station Review: ఓదెల రైల్వే స్టేషన్ సినిమా రివ్యూ & రేటింగ్!

లాక్ డౌన్ కి ముందు దర్శకుడు సంపత్ నంది సారధ్యంలో కెకె.రాధామోహన్ నిర్మాణంలో మొదలైన చిత్రం “ఓదెల రైల్వే స్టేషన్”. కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కీలకపాత్ర పోషించగా.. థియేట్రికల్ రిలీజ్ నోచుకోలేక, ఆహా ఒటీటీ ద్వారా విడుదలైంది.

కథ: ఓదెల అనే గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలన్నీ రేప్ & మర్డర్లు, అది కూడా కొత్తగా పెళ్లి అయ్యి, శోభనం జరిగిన యువతులవి కావడం ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఆ కేస్ ను హ్యాండిల్ చేయడానికి రంగంలోకి దిగుతాడు ఐ.పి.ఎస్ అధికారి (సాయి రోనక్). ఈ కథలో హెబ్బా పటేల్ & వశిష్ట సింహాల పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన అంశం.

నటీనటుల పనితీరు: డీ-గ్లామర్ రోల్లో హెబ్బా పటేల్ నటిగా ఆకట్టుకుంది. కానీ.. ఆమె పాత్రకు సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో, ఆమె పాత్రకు ఆడీయన్స్ కనెక్ట్ అవ్వలేరు. పోలీస్ ఆఫీసర్ గా సాయి రోనక్ అలరించాడు. వశిష్ట సింహా నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. క్యారెక్టర్ పరంగా జస్టిఫికేషన్ మిస్ అయ్యింది. ఇక మిగతా నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: రచయిత సంపత్ నంది రాసుకున్న కథలో దమ్ము లేదు, అలాగే.. అసలు హంతకుడు అలా ఎందుకు చేస్తున్నాడు? అతడు అలా మారడానికి కారణం ఏమిటి? అనేందుకు చిన్నపాటి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించి, దానికి చిన్నపాటి సైకలాజికల్ ఇష్యూ తగిలించాడు కానీ.. ఎందుకో సింక్ అవ్వలేదు. ఇక దర్శకుడు అశోక్ తేజ, ఎంతో స్కోప్ ఉన్న కథను చాలా సాదాగా ముగించేశాడు.

ఒక “రాక్షసుడు” రేంజ్ కంటెంట్ ఉన్న కథ ఇది. కానీ.. దర్శకుడు ఆ ఎమోషన్ ను సరిగా ఎలివేట్ చేయలేక చతికిలపడ్డాడు. అనూప్ రూబెన్స్ సంగీతం, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమాకి మైనస్ అయ్యాయి. కథకి కావాల్సినంతగా ఖర్చు పెట్టలేదు నిర్మాతలు. అందువల్ల ఏదో సీరియల్ చూస్తున్న భావన కలుగుతుంది.

విశ్లేషణ: మంచి పొటెన్షియల్ ఉన్న కథ.. సరైన కథనం, ఆకట్టుకునే క్యారెక్టరైజేషన్స్ లేక బోర్ కొట్టించిందనే చెప్పాలి. కనీసం కాస్త బోల్డ్ గా తీసి ఉంటే.. కనీసం ఒక వర్గం ప్రేక్షకులు కాస్త ఎంజాయ్ చేసేవారు. అదీ లేకపోవడంతో “ఓదెల రైల్వే స్టేషన్” ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus