The Odyssey: నోలన్ మావ సినిమా.. ఐమ్యాక్స్ టికెట్ రూ.3 వేలట
- July 17, 2026 / 12:15 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్‌ని తెలుగు సినిమా ప్రేక్షకులు నోలన్ మావ అని ముద్దుగా పిలుచుకుంటారు. అంటే అంతగా ఆయన్ని ఓన్ చేసుకున్నారన్నమాట. ఆయన తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పాలంటే ఈ సినిమా టికెట్ రేట్ల గురించి తెలుసుకోవాలి. మల్టీప్లెక్స్‌ల్లోనే ఎక్కువగా ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఒక్కో టికెట్‌కు భారీ ధర పలుకుతోంది.
The Odyssey
తొలిసారిగా ఐమ్యాక్స్ 70 ఎంఎం కెమెరాలతో తెరకెక్కించిన ఈ సినిమాను కుదిరితే ఐమ్యాక్స్ తెరపైనే చూడాలని అనుకుంటున్నారు అభిమానులు. అందుకే అడ్వాన్స్ బుకింగ్‌ల విషయంలో ఈ సినిమా జోరు చూపిస్తోంది. ఐమ్యాక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పలుకుతోందట. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో ఐమ్యాక్స్ ఫార్మాట్ థియేటర్లన్నీ ఈ వీకెండ్ వరకు హౌస్‌ఫుల్ అయినట్లు సమాచారం. అన్నింటా ‘ది ఒడిస్సీ’ సినిమానే ఆడుతోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఇతర థియేటర్లలోనూ టికెట్ల అమ్మకాల జోరు మామూలుగా లేదు. మన దేశంలో తొలి మూడు రోజులకు రూ.18 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయట. ఈ లెక్కన తొలి వీకెండ్‌కి రూ.75 కోట్ల మధ్య వసూళ్లు రావొచ్చని చెబుతున్నారు. ‘ది ఒడిస్సీ’ కథేంటంటే.. గ్రీకు రాజ్యం రాజు అగమెమ్మన్. అతడి తమ్ముడి పేరు మెనలియస్. అతడి భార్య హెలెన్. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ. గ్రీక్‌కి సమీపంలోనే ఉన్న మరో రాజ్యం ట్రాయ్. దాని రాజు ప్రియమ్. అతడికి హెక్టర్, పారిస్ అనే కొడుకులు ఉన్నారు.
గ్రీకు రాజ్యం చూడటానికి వచ్చిన పారిస్‌కి మెనలియస్ ఆతిథ్యమిస్తాడు. అప్పుడు హెలెన్‌ను చూసి పారిస్ ప్రేమిస్తాడు. అతడి అందానికి హెలెన్ మంత్రముగ్ధురాలవుతుంది. గ్రీక్ నుండి తిరిగి వెళ్లేటప్పుడు హెలెన్‌ను తీసుకుని ట్రాయ్‌కు వచ్చేస్తాడు. దీంతో గ్రీకులు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి వేల నౌకలతో ట్రాయ్‌పైకి యుద్ధానికి వెళ్తారు. ఆ తర్వాతేమైంది అనేది సినిమా.











