Radhe Shyam OTT: అనుకున్న దానికంటే ముందుగానే.. ఓటీటీలోకి రాధే శ్యామ్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించనివిధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజే సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులను మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. కమర్షియల్ గా ఈ సినిమా డిజాస్టర్ అని రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చేసింది.

Click Here To Watch NOW

ఇక ఫైనల్ గా ఈ సినిమాను విడుదల చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అసలైతే రాధే శ్యామ్ సినిమాను రెండు మూడు నెలల తర్వాత ఓటీటీ లో విడుదల చేయాలని యు.వి.క్రియేషన్స్ అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఓటీటీ రూపంలో నిర్మాతలకు లాభాలు అయితే చాలానే వచ్చాయి. కనీసం యాభై రోజుల తర్వాత అయినా విడుదల చేస్తారు అనుకుంటే నెల కూడా గడవకముందే సినిమాను ఓటీటీలోకి విడుదల చేస్తుండటం విశేషం.

ఉగాది పండగ వస్తూ ఉండటంతో ఏప్రిల్ ఒకటో తేదీన సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సినిమా మొత్తానికి డికస్టర్ అని క్లారిటీ రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక సినిమా డిజాస్టర్ టాక్ రాగానే ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమాను చూడడానికి ఇష్టపడలేదు. ఇక అమెజాన్ ప్రైమ్ లో చాలామంది చూడాలని అనుకుంటున్నారు.

మరి ఆ రూట్లో సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించాడు. సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేయగా సినిమా నాన్ థియేట్రికల్ ద్వారా దాదాపు రెండు వందల యాభై కోట్లకి పైగా లాభాలు దక్కాయి. నిర్మాతలు సేఫ్ అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus