47 ఏళ్ళ వయసులో కూడా ‘ఓజి’ బ్యూటీ తగ్గడం లేదుగా.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

ఇప్పుడంతా ‘ఓజి’ మేనియా నడుస్తుంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే నిన్న రాత్రి వేసిన ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓ సాలిడ్ హిట్ పడింది అని అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి.

Sriya Reddy

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఓజి విజృంభిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అందులో బాగా హైలెట్ అయ్యింది శ్రీయ రెడ్డి పాత్ర కూడా ఒకటి.

‘ఓజి’ లో ఆమె సత్య దాదా కోడలు గీత పాత్రలో నటించింది. ఆమె రోల్ ను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో.. శ్రీయ రెడ్డి పాత్రకు కూడా అంతే రేంజ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది.

ముఖ్యంగా పోర్ట్ సన్నివేశంలో విలన్ మనుషుల్లో ఒకరైన అభిమన్యు సింగ్ కి ఈమె వార్నింగ్ ఇచ్చే తీరు అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది.

దర్శకుడు సుజిత్ ఈమె పాత్రను చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడు. ‘ఓజి’ తో శ్రీయ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి ఊపు వచ్చినట్టే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. శ్రీయ రెడ్డి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 47 ఏళ్ళ వయసులో కూడా ఈమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

రేపు ఒక్కరోజే ఓటీటీలో 21 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus