పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ ‘ఓజి’ (OG) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ‘ఓజి’. పవన్ కళ్యాణ్ ను దర్శకుడు సుజిత్ ప్రజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది.
దీంతో మొదటి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ 2వ రోజు నుండి ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఏదేమైనప్పటికీ వీకెండ్ వరకు ‘ఓజి’ మంచి వసూళ్లు రాబట్టింది. కానీ మొదటి సోమవారం నుండి బాగా డౌన్ అయ్యాయి. తర్వాత అంటే మంగళవారం రోజున మరింతగా తగ్గాయి.
ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 36.58 cr |
సీడెడ్ | 15.90 cr |
ఉత్తరాంధ్ర | 11 cr |
ఈస్ట్ | 9.83 cr |
వెస్ట్ | 6.91 cr |
గుంటూరు | 8.40 cr |
కృష్ణా | 7.52 cr |
నెల్లూరు | 33.33 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 100.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 13.41 cr |
ఓవర్సీస్ | 30.02 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 143.9 (షేర్) |
‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.143.9 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.237 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.30.1 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. దసరా పండుగ హాలిడేస్, సెకండ్ వీకెండ్ హెల్ప్ తో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ‘కాంతార చాప్టర్ 1’ కూడా పోటీగా ఉంది కాబట్టి.. చూడాలి మరి.