కిరణ్ అబ్బవరం తన ఫ్యామిలీతో కలిసి దసరా పండుగని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్య రహస్య గోరక్, అలాగే బాబుతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవారి సన్నిధిలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్..ల బాబు నామకరణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తన కుమారుడికి హను అబ్బవరం అని పేరు పెట్టారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్..లది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. 2019 లో వచ్చిన వీరి మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ టైంలోనే వీరి మధ్య పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. రహస్య పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే. ఈమె కూచిపూడి డాన్సర్. ‘ఆకాశమంత ప్రేమ’ ‘బాయ్స్ ఇన్ స్కూల్’ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించింది.
‘రాజావారు రాణిగారు’ తో పాటు ‘సర్బత్’ అనే సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. కిరణ్ అబ్బవరంని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మరో పక్క కిరణ్ అబ్బవరం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక వీరి దసరా సెలబ్రేషన్స్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి.