OG Movie: ఓజీకి ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

ప్రస్తుతం టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘ఓజీ’. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుండి అభిమానుల్లో అంచనాలు మామూలు స్థాయిలో ఏర్పడలేదు. డైరెక్టర్ సుజిత్ పెద్ద డైరెక్టర్ ఏమి కాదు, ఆయన రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తే, అందులో ఒకటి సూపర్ హిట్ కాగా, మరొకటి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

అలాంటిది ఎందుకు ఈ సినిమాపై అభిమానులు ఆ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు అంటే, ఇది ఒక యాక్షన్ జానర్ కి సంబంధించిన సినిమా అవ్వడమే. దానికి తోడు పవన్ కళ్యాణ్ 8 ఏళ్ళ తర్వాత చేస్తున్న డైరెక్ట్ సినిమా. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ రీమేక్ చిత్రాలే. అందులో రెండు సినిమాలు హిట్ అయ్యినప్పటికీ అవి పవన్ కళ్యాణ్ రేంజ్ కాదు.

అంతే కాకుండా ‘ఓజీ’ (OG Movie) చిత్రం నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ లో కూడా అమితాసక్తిని రేపాయి. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఇంత అద్భుతమైన లుక్స్, ఇంత స్టైలిష్ స్వాగ్ లో చూస్తామని అనుకోలేదు అంటూ గ్లిమ్స్ వీడియో ని చూసిన తర్వాత అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ గ్లిమ్స్ వీడియో కి యూట్యూబ్ లో దాదాపుగా అన్నీ చానెల్స్ కి కలిపి 39 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఆ గ్లిమ్స్ వీడియోలో ఉన్న ‘హంగ్రీ చీతా’ సౌండ్ ట్రాక్ ని అన్నీ మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో అప్లోడ్ చేసింది మూవీ టీం. ఆ మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ నుండి దాదాపుగా 11 మిలియన్ల స్త్రీమింగ్స్ దక్కాయి. మొత్తం మీద సోషల్ మీడియా లో ఈ గ్లిమ్స్ వీడియో కి 50 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ కూడా మంచి వ్యూస్ తో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus