OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘ఓజి’ సినిమా మరో 3 రోజుల్లో విడుదల కానుంది. సెప్టెంబర్ 25న ‘ఓజి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ డోస్ పెంచుతూ నిన్న ‘ఓజి కాన్సర్ట్’ ను నిర్వహించారు. అలాగే నిన్న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.. కానీ డిఐ పూర్తికాలేదు అనే కారణంతో రిలీజ్ చేయలేదు.

OG Trailer

అయితే నిన్నటి ఈవెంట్లో ‘ఓజి’ ట్రైలర్ ను ప్లే చేశారు. కానీ అది అంతగా క్లారిటీగా లేకపోవడంతో అభిమానులు కొంత డిజప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియాలో ‘ఓజి’ ట్రైలర్ ను మనస్ఫూర్తిగా చూద్దామని భావించిన అభిమానులకి.. ‘డివివి ఎంటర్టైన్మెంట్స్’ దానిని మరింతగా డిలే చేసి పెద్ద పరీక్షే పెట్టింది. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం సడన్ గా సోషల్ మీడియాలో ట్రైలర్ ను వదిలింది.

‘ఓజి’ ట్రైలర్ 2 నిమిషాల 39 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ముంబైలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయ్. కానీ ఈసారి గన్స్ అన్నీ సత్య దాదా వైపు తిరిగాయ్. దాదా వరకు వెళ్ళారంటే.. పరిస్థితి చేజారి పోతున్నట్టు ఉంది. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే’ అంటూ శుభలేఖ సుధాకర్ పాత్ర వాయిస్ ఓవర్లో ట్రైలర్ మొదలైంది. అదే టైంలో విలన్ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ వచ్చింది.

సత్య దాదా కుటుంబానికి ‘ఓజి’ కి ఉన్న సంబంధం ఏంటి? ‘ఓజి’ గతమేంటి? ఈ సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ లో దర్శకుడు సుజిత్ మార్క్,టెక్నికల్ బ్రిలియన్స్ కనిపించాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది. మొత్తానికి ‘ఓజి’ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలానే కనిపిస్తుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus