ఇప్పుడు ఓటిటి అనేది చిన్న సినిమా నిర్మాతలకు పెద్ద వరంలా మారిపోయింది. సంవత్సలకు.. సంవత్సరాలు సినిమాని ల్యాబ్స్ లో ఉంచనవసరం లేదు. తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమాని ఓటిటికి ఇచ్చేస్తే.. అడ్వాన్స్ గా కొంత ఎమౌంట్ ఇస్తారు. అటు తర్వాత వ్యూయర్-షిప్ ను ఆధారం చేసుకుని మరింత ఎమౌంట్ ఇస్తారు. కాబట్టి చాలా వరకూ నిర్మాత సేఫ్ అయిపోవచ్చు. ఇదిలా ఉంటే.. ‘అసలు సినిమాకి మనం ఎందుకు బడ్జెట్ పెట్టాలి.. ఆ పెట్టించేది ఏదో ఓటిటి వాళ్ళతోనే పెట్టిస్తేనే బెటర్ కదా’ అనే ఐడియా మన యాంకర్ మరియు దర్శకుడు అయిన ఓంకార్ కు వచ్చేసింది.
నిజానికి ఈ ఐడియా ఓ సందర్భంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు చెప్పిందే..! ఇదిలా ఉండగా ఓంకార్.. తన ‘రాజు గారి గది4’ ప్రాజెక్టు కు ఆ ఫార్ములానే అప్లై చేసేస్తున్నాడు. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారికి ‘రాజు గారి గది’ స్క్రిప్ట్ ను చెప్పి ఓకే చేయించుకుని..ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించడానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ‘హాట్ స్టార్’ లోనే విడుదల చేస్తాడట.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. ఇక ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన ‘రాజు గారి గది’ చిత్రం బ్లాక్ బస్టర్ కాగా.. ‘రాజు గారి గది2’ యావరేజ్ గా నిలిచింది. ఇక ‘రాజు గారి గది3’ కి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం హిట్ లిస్ట్ లో చేరింది. మరి ‘రాజు గారి గది4’ ఎలా ఉండబోతుందో..!
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!