‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి 6 సినిమాలు ప్లాపులు అవ్వడంతో శర్వానంద్ రేసులో కాస్త వెనక్కి పడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది అతనికి 30వ సినిమా కావడం విశేషం.! నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ మొదట ఈ సినిమా పై అంచనాలు లేకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కానీ రెండో రోజు నుండి పికప్ అయ్యింది.11 వ రోజున కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం
2.85 cr
సీడెడ్
0.51 cr
ఉత్తరాంధ్ర
0.69 cr
ఈస్ట్
0.46 cr
వెస్ట్
0.32 cr
గుంటూరు
0.44 cr
కృష్ణా
0.41 cr
నెల్లూరు
0.23 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.91 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.52 cr
ఓవర్సీస్
1.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
9.33 cr
‘ఒకే ఒక జీవితం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10 కోట్లు.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.9.33 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.67 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 వ రోజున కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ కు కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయి.