శర్వానంద్ మంచి ప్రామిసింగ్ హీరో, అలాగే మంచి టేస్ట్ ఉన్న హీరో కూడా..! అయితే అతని గత 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇలా వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అయ్యింది. అయితే ఈసారి ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది అతనికి 30వ సినిమా.! నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది.’డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని వీక్షించిన కొంతమంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట.
కంటెంట్ పరంగా, ఎమోషనల్ సీన్స్ పరంగా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుందని, సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్టింగ్ పెరిగేలా చేస్తుందని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా సాగినా ఎంగేజ్ చేసే విధంగానే ఉంటుందని, డైలాగ్స్ , ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టించే విధంగా ఉంటాయని సినిమా చూసిన వారు ట్విట్టర్లో పేర్కొంటున్నారు.
ఓవరాల్ గా చాలా కాలం తర్వాత శర్వానంద్ మార్క్ ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోల నుండి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
A time travel movie told in an emotional way with situational comedy in parts. The Director comes up with a novel way of telling a sci fi story and it works well. Go for it!
. @ImSharwanand you are a special actor man. Only few can accept these kind of roles and giving an opportunity to newcomers with fresh subjects. I appreciate that & please continue your versatility in story selection. 👍#OkeOkaJeevitham
#OkeOkaJeevitham (Telugu) getting good/favourable reviews , Hope it's Tamil version #Kanam also do well in TN
Highly expected #Captain (Tamil) getting below average/unfavourable reviews from the start (yesterday release) #Brahmastra as of now seeing Ok-Ok/Avg reviews