Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఒక్కడొచ్చాడు

ఒక్కడొచ్చాడు

  • December 24, 2016 / 05:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్కడొచ్చాడు

ఇంట్రో : విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఒక్కడొచ్చాడు”. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సూరజ్ దర్శకుడు. బ్లాక్ మనీ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : అర్జున్ (విశాల్) పూర్వ జన్మ అనే నాటకంతో డిజిపి చంద్రబోస్ (జగపతిబాబు) చెల్లెలు దివ్య (తమన్నా)ను ప్రేమలో పడేస్తాడు. దివ్యను ఉపయోగించుకొని చంద్రబోస్ అక్రమంగా దాచిపెట్టిన 250 కోట్ల రూపాయలను దొంగిలించి పారిపోతాడు. చంద్రబోస్ తో పాటు కొంతమంది పొలిటీషియన్స్ దగ్గర్నుంచి కూడా కోట్ల రూపాయల నల్లధనాన్ని దొంగిలించి హవాలా రూపంలో వేరే ఉర్లకు పంపిస్తుంటాడు. తాము ఏళ్ళు తరబడి కూడబెట్టుకొన్న నల్లధనం అర్జున్ నిమిషంలో మాయం చేసేయడంతో పోలీస్ అండ్ రౌడీ గ్యాంగ్ కలిసి అర్జున్ కోసం వేట మొదలుపెడతారు. అసలు అర్జున్ (విశాల్) ఎవరు, ఇన్ని కోట్ల రూపాయలను ఎందుకు దొంగతనం చేస్తున్నాడు, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడు వంటి ప్రశ్నలకు పస లేని సమాధానాల సమాహారమే “ఒక్కడొచ్చాడు” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు :
విశాల్ పోషించిన అర్జున్ పాత్ర వ్యవహారశైలిలో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ ఏమాత్రం కొత్తదనం ఉండదు. ఇక కామెడియన్స్ సూరి, వడివేలుతో కలిసి విశాల్ చేసే కామెడీ సీన్లకి నవ్వాలో ఎడ్వాలో అర్ధం కాని పరిస్థితి ప్రేక్షకులది. ఓ మూడు పాటల్లో అందాలు ఆరబోయడం, ఒక అయిదారు సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ తరహాలో హీరో వెనుక నిల్చోవడం మినహా మరో పని లేనట్లుగా ఆమె పాత్రని డిజైన్ చేశారు.
విలన్ గా మారాక జగపతిబాబు పోషించిన పనికిమాలిన పాత్రల్లో “ఒక్కడొచ్చాడు” సినిమాలోని డిజిపి చంద్రబోస్ ఒకటిగా చెప్పుకోవచ్చు. కమెడియన్స్ సూరి, వడివేలులు హీరో చేతిలో తన్నులు తినడం ఎక్కువ, కామెడీ చేయడం తక్కువ. వారి క్యారెక్టరైజేషన్స్ కూడా అదే స్థాయిలో ఉండడం బాధాకరం. ముఖ్యంగా మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అయిన వడివేలును కుక్క కంటే దారుణంగా కొట్టడం, ఆ చితకొట్టుడు ద్వారా చెత్త కామెడీ క్రియేట్ చేయాలని చేసిన ప్రయత్నం పరమచెత్తగా ఉంది.

సాంకేతికవర్గం పనితీరు : హిప్ హాప్ తమిళ (ఆది) బాణీలు బాగున్నప్పటికీ.. వాటి ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడంతో, అప్పటికే చాలా చిరాగ్గా కుర్చీలో కూర్చోన్న ఆడియన్ ఇంకాస్త అసహనానికి లోనవుతుంటాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు వేటికవే ఒకదానితో ఒకటి పోటీపడి నీచమైన ఔట్ పుట్ ను ఇచ్చాయి. సో, సాంకేతికవర్గం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇక వరుసగా “బ్యాడ్ బోయ్, సకల కళా వల్లవన్” లాంటి సూపర్ ఫ్లాప్స్ కి ఇప్పుడు “ఒక్కడొచ్చాడు” అనే మరో ఫ్లాప్ ను తగిలించుకొని హ్యాట్రిక్ ఫ్లాప్ సొంతం చేసుకొన్నాడు దర్శకుడు సూరజ్. కథ-కథనాలపై కనీస స్థాయి జాగ్రత్త చూపక, ఏదో నాలుగు కామెడీ సీన్లతో కథను చుట్టేద్దామని సూరజ్ చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టడంతోపాటు ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారింది.

విశ్లేషణ : తమన్నా ఉంది కదా ఆమె అందాలతో కనువిందు చేసుకొందామనో, విశాల్ ఉన్నాడు కదా మాస్ యాక్షన్ సీన్లు ఉంటాయేమో అని ఆశపడి థియేటర్ లోకి వెళ్ళిన ప్రేక్షకుడు “ఎందుకు వచ్చాన్రా భగవంతుడా ?!” అని తలబాదుకొనేలా చేసే సినిమా “ఒక్కడొచ్చాడు”. రెండ్రోజులాగితే థియేటర్ లో ఒక్కడు కూడా మిగలడు.

రేటింగ్ : 1/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Actress Tamanna
  • #hari
  • #Hero Vishal
  • #okkadochadu movie

Also Read

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

57 mins ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

3 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

1 day ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

1 hour ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

2 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

2 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

3 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version