యూట్యూబ్ లో ఉన్న సినిమాలకు భారీ రేట్లు కరెక్టేనా?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే. యావరేజ్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఆయా హీరోల పుట్టినరోజున థియేటర్లలో మళ్లీ విడుదలవుతున్నాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది.

ఈ నెల 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో పోకిరి సినిమా రీరిలీజ్ కాగా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజున ఇంద్ర, ఘరానా మొగుడు ప్రభాస్ పుట్టినరోజున వర్షం, నాగార్జున పుట్టినరోజున సోగ్గాడే చిన్నినాయన సినిమాలు రీరిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. అయితే రీరిలీజ్ కానున్న ఈ సినిమాలకు సైతం టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంపై ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ మల్టీప్లెక్స్ లలో రీరిలీజ్ కానున్న సినిమాలకు ఎక్కువగా టికెట్ రేట్లు ఉండటంపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి. ఇలా టికెట్ రేట్లను పెంచడం వల్ల సినిమా రంగానికి అన్యాయం జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాత సినిమాలకు డిస్కౌంట్లు ఇస్తే బాగుంటుందని యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న సినిమాలకు తక్కువ టికెట్ రేట్లు పెట్టడం మంచిదని ప్రేక్షకులు చెబుతున్నారు. కరోనా తర్వాత సినిమాల సక్సెస్ రేట్ ఊహించని స్థాయిలో తగ్గింది. ఇలాంటి సమయంలో ఎక్కువ టికెట్ రేట్లు పెట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టమే తప్ప లాభం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus