Om Bheem Bush Collections: ‘ఓం భీమ్ బుష్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

‘బ్రోచేవారెవరురా'(Brochevarevarura)  వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు(Sree Vishnu), ప్రియదర్శి(Priyadarshi) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబినేషన్లో రూపొందిన సినిమా‘ఓం భీమ్ బుష్'(Om Bheem Bush). ‘హుషారు’ (Husharu)  ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు (Sunil Balusu) కలిసి నిర్మించగా…, ‘యువి క్రియేషన్స్’ సంస్థ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్.. సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాయి. మార్చి 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా వచ్చాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.32 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.95 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.09 cr (షేర్)

‘ఓం భీమ్ బుష్’ చిత్రానికి రూ.6.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.3.09 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.3.47 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus