Priya Varrier: ప్రియా వారియర్ పరువు తీసిన ప్రముఖ దర్శకుడు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ప్రియా వారియర్ ఒకరు. ప్రియా వారియర్ కు సినిమా సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రియా వారియర్ ఎక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచాయి. అయితే ఒరు ఆదార్ లవ్ సినిమాతో ప్రియా వారియర్ కెరీర్ మొదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియా వారియర్ ఒరు ఆదార్ లవ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో కన్ను గీటే ఐడియా తనదేనని చెప్పుకొచ్చారు.

ప్రియా వారియర్ (Priya Varrier0) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించగా ఆ విషయం తెగ వైరల్ అయింది. ఈ విషయం ఒరు ఆదార్ లవ్ దర్శకుని దృష్టికి రాగా ఓమర్ లాలూ ఫేస్ బుక్ లో ప్రియ వారియర్ ను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం. ప్రియా వారియర్ పిచ్చి పిల్ల అని ఐదు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఆమె మరిచిపోయిందని దర్శకుడు ఓమర్ లాలూ చెప్పుకొచ్చారు.

ప్రియా వారియర్ వలియ చందినాది అనే తైలాన్ని రాసుకోవాలని ఈ తైలం జ్ఞాపకశక్తి మెరుగుపరచటానికి ఉపయోగపడుతుందని ఆయన సెటైర్లు వేశారు. ఓమర్ లాలూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ ఆయ్యాయి. ఆయన చేసిన కామెంట్ల గురించి ప్రియా వారియర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

వింక్ ఐడియా తన సహ నటుడు రోషన్ దని గతంలో ప్రియ ఒక సందర్భంలో వెల్లడించగా అందుకు సంబంధించిన వీడియోను సైతం ఒమర్ లాలూ పోస్ట్ చేశారు. ఒమర్ లాలూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియా వారియర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus