‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో చేస్తున్నట్టు నిన్న అధికారిక ప్రకటన వచ్చింది.’సన్ పిక్చర్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు.’మాస్ మీట్స్ మ్యాజిక్’ అంటూ సినిమా జోనర్ ఏంటి అన్నది తెలిపారు. ఈ సినిమా కోసం ఓ కొత్త యూనివర్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నట్టు ధృవీకరించారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు సమాచారం.
దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. కంప్లీట్ అయ్యేసరికి లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా ఏ హీరో నటిస్తుంది? అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం… ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా సమంతని (Samantha) తీసుకోబోతున్నారట. అవును..! సమంత ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ. కాబట్టి.. పాన్ ఇండియా సినిమాలకి పర్ఫెక్ట్ ఛాయిస్.
‘పుష్ప’ (సిరీస్) తో అల్లు అర్జున్ కి కూడా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. హిందీలో అల్లు అర్జున్ మార్కెట్ పది రెట్లు పెరిగింది. ఇక అట్లీ ఎలాగూ ‘జవాన్’ తో (Jawan) రూ.1000 కోట్ల క్లబ్లో చేరాడు. కాబట్టి.. ఈ ముగ్గురు కాంబినేషన్ అంటే బిజినెస్ కి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే సమంతకి భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాకి లాక్ చేసినట్లు సమాచారం. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) లో హీరోయిన్ గా నటించింది సమంత. అలాగే ‘పుష్ప’ (Pushpa) లో ఐటెం సాంగ్ కూడా చేసింది.