నార్త్ vs సౌత్ డేట్ క్లాష్‌లు.. లాభం కన్నా నష్టమే ఎక్కువ?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ పోటీ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR), కేజీఎఫ్ (KGF), పుష్ప (Pushpa) లాంటి చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీ తన స్థాయిని ప్రపంచానికి చూపించగా, బాలీవుడ్ మాత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ (Box Office) కలెక్షన్ల పరంగా ఇంకా ఆధిపత్యం చూపిస్తోంది. ఈ పోటీ మాటల్లో ఐక్యత ఉన్నట్లు కనిపించినా.. గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ నిర్మాతలు పలు సినిమాలకు డేట్స్ లాక్ చేసినా.. సౌత్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల విడుదల తేదీలను చూసి వెనక్కి తగ్గుతున్న సందర్భాలు కనిపించాయి.

Coolie, War 2

ఉదాహరణకు పుష్ప 2తో పోటీకి వచ్చిన ఛావా సినిమా చివరికి వేరే డేట్‌కి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. దీన్ని బట్టి పోటీ కంటే, డేటింగ్ క్లాష్‌ల వల్ల కలెక్షన్లు తక్కువవుతాయని నిర్మాతలు కూడా గ్రహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్. యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ 2026 మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ మూవీకి మరుసటి రోజు అంటే మార్చి 20న బాలీవుడ్ స్టార్‌లైనప్‌తో తెరకెక్కుతున్న సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ సినిమా విడుదల అవుతుంది.

రెండు సినిమాల మధ్య ఒక్కరోజే గ్యాప్ ఉంది. ఈ తరహా రిలీజ్‌లు వసూళ్లను ఇంపాక్ట్ చేసే ప్రమాదం ఉందని ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఇదే విధంగా వార్ 2 (War 2) మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుండగా.. అదే రోజున రజినీకాంత్ (Rajinikanth) లోకేష్ (Lokesh Kanagaraj)  కాంబోలో తెరకెక్కుతున్న కూలీ (Coolie)  కూడా థియేటర్లలోకి రానుంది. ఇద్దరూ పెద్ద స్టార్లు. కానీ ఒక్కరోజు పాటు రెండు భారీ సినిమాల క్లాష్ ఆ సినిమాల వసూళ్లను ప్రభావితం చేయడం ఖాయం.

ఇదే సందర్భంలో గతంలో ‘ఛావా (Chhaava) – పుష్ప 2’లా (Pushpa 2) డేట్ మార్చుకుంటే ఇద్దరికీ లాభమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్, ఓపెనింగ్, నాన్ థియేట్రికల్ డీల్స్ ఇలా అన్నింటిలోను పెద్ద ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ ఓ ముఖ్యమైన ప్రమాణం. మేకర్స్ ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల హైప్ ఉంటుందేమో కానీ, కలెక్షన్లు విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నిర్మాతలు డేట్ విషయంలో ముందే ప్లానింగ్ చేసుకుంటే లాభం చేకూరుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అక్టోబరు నుండి సినిమా అన్నారు.. మరి ఏప్రిల్‌ 8ని అలా వదిలేశారేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus