‘మౌనమేలనోయి’ ‘నిను చూడక నేనుండలేను’ ‘ఒరేయ్ పండు’ ‘నీ జతగా నేనుండాలి’ వీడెవడు’ ‘అమావాస్య’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సచిన్ జోషి. నిజానికి ఇతను నార్త్ కు చెందిన వాడైనప్పటికీ.. తెలుగులోనే ఫేమస్ అయ్యాడు. అయితే మొదట చేసిన రెండు సినిమాలు పర్వాలేదనిపించినా.. తరువాతి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇతనికి అవకాశాలు తగ్గాయి. అయితే ఎదో వివాదంతో ఇతను వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కొన్నేళ్ల క్రితం.. నిర్మాత బండ్ల గణేష్ తో ఆర్ధిక లావాదేవీల్లో గొడవ పెట్టుకున్నాడు.
తరువాత అక్రమ గుట్కా రవాణా కేసులో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే.. మరోసారి సచిన్ జోషిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సచిన్ జోషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారట. ప్రముఖ బిజినెస్‌మెన్ విజయ్ మాల్యాకు సంబంధించిన ఓ బంగ్లాను సచిన్ జోషి గతంలో కొనుగోలు చేశాడట. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఓంకార్ గ్రూప్ మరియు సచిన్ జోషిల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో తేడా వచ్చింది.
ఈ విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో సచిన్ జొషి.. 100 కోట్ల మేరకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలోనే ఈ విషయమై విచారణకు హాజరు కావాల్సిందిగా సచిన్ జోషికి సమన్లు పంపింది ఈడీ. అయినప్పటికీ సచిన్ జోషి విచారణకు హాజరు కాలేదట.. దాంతో ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?