Allu Arjun, Trivikram: అభిమానులకు బన్నీ భారీ షాకిస్తారా?

బాహుబలి, కేజీఎఫ్ తరహాలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది సెకండాఫ్ లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ మొదలుకానుంది. అయితే బన్నీ త్రీవిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ అయిందని త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. తాజాగా బన్నీ వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే.

ప్రముఖ నిర్మాత నాగవంశీ బన్నీ, త్రివిక్రమ్, థమన్ లతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ త్వరలో సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. బన్నీ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ప్రకటన గురించే నాగవంశీ ప్రకటించనున్నారని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబో సినిమా మొదలవుతుందేమో చూడాల్సి ఉంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు తెరకెక్కి ఘన విజయం సాధించాయి.

ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ వస్తున్న వార్తల విషయంలో అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. బన్నీ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. పుష్ప పార్ట్1 తర్వాత బన్నీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus