సుమారు రెండు నెలలు పైనే షూటింగ్ లు ఆగిపోయాయి. దీంతో సినీ ఇండస్ట్రీ చాలా వరకూ నష్టపోయింది. అందుకే.. ఈ ఐదవ విడత లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ప్రభుత్వం ఇస్తున్న తరుణంలో.. మన ఇండస్ట్రీ పెద్దలు కూడా షూటింగ్ లకు ప్రభుత్వం నుండీ అనుమతులు తెచ్చుకున్నారు. జూన్ 15వ తారీఖు నుండీ మళ్ళీ షూటింగ్లు మొదలయ్యాయి. కొద్ది మంది క్యాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ లు జరుపుకోవచ్చని కొన్ని నిబంధనలతో ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో.. అందరూ షూటింగ్ లు చేసుకోవడానికి రెడీ అయ్యారు.
కానీ పెద్ద సినిమాలకు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు పనికిరావడం లేదు. తక్కువ మంది ‘క్యాస్ట్ అండ్ క్రూ’ తో పెద్ద సినిమా షూటింగ్ లు జరుపుకోవడం అసాధ్యమని దర్శకుడు రాజమౌళి కూడా చేతులెత్తేశాడు. సరే.. చిన్న సినిమాల షూటింగ్లకు, టీవీ షోలకు, అలాగే సీరియల్స్ షూటింగ్ లకు.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కలిసొచ్చాయి కదా అని అనుకుంటే.. ఇప్పుడు వాటికి కూడా బ్రేక్ పడిందని సమాచారం. తాజాగా ఓ సీరియల్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటుడికి క*నా పాజిటివ్ అని తేలింది.
దీని కారణంగా వెంటనే ఆ సీరియల్ షూటింగ్‌ను ఆపేసి యూనిట్ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. దీంతో మిగిలిన సీరియల్స్ షూటింగ్ ల టీం సభ్యులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ‘ఇలాగే షూటింగ్ లు నిర్వహిస్తే.. మిగిలిన ‘క్యాస్ట్ అండ్ క్రూ’ కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందని’ వారు భయపడుతున్నారట. ఈ కారణంగా షూటింగ్లు ఆపేసినట్టు తెలుస్తుంది. మరి కొద్దిరోజుల తరువాత అయినా తిరిగి షూటింగ్లు నిర్వహిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!