ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కొన్నిరోజుల క్రితం సినిమా టికెట్ రేట్లను పెంచుతూ కొత్త టికెట్ల జీవోను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కొత్త టికెట్ రేట్లు చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు అనుకూలంగానే ఉన్నా పెద్ద సినిమాలకు ఏ మాత్రం అనుకూలంగా లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే కొత్త టికెట్ల జీవో అమలులోకి వచ్చిన తర్వాత విడుదలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు టికెట్ రేట్లు మరింత పెంచుకోవడానికి ఏపీ సర్కార్ అనుమతులు ఇచ్చింది.
అందువల్ల ఈ రెండు సినిమాలపై ఏపీ టికెట్ రేట్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే త్వరలో ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా కొంతమేర టికెట్ రేట్లను పెంచితే మాత్రమే నిర్మాతలకు ఇబ్బందులు కలగవని చెప్పవచ్చు. ఆచార్య కోసం చిరంజీవి మళ్లీ జగన్ ను కలవక తప్పదని ఇండస్ట్రీలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే ఆచార్య బడ్జెట్ లో ఎక్కువ మొత్తం చిరంజీవి, చరణ్, కొరటాల శివ పారితోషికాల కోసమే ఖర్చైంది. రెమ్యునరేషన్లు కాకుండా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటిందో లేదో క్లారిటీ లేదు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఈ రెండు సినిమాల విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు టికెట్ రేట్లను మరింత పెంచకపోతే మాత్రం నిర్మాతలకు నష్టమేనని చెప్పవచ్చు.
అయితే ఈ రెండు సినిమాలకు కూడా ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆచార్య సినిమా కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల ఆలస్యంగా థియేటర్లలో రిలీజవుతోంది. ఆచార్యలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొరటాల శివ ఈ సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!