Rajinikanth, Deepika Padukone: సూపర్ స్టార్ తో దీపికా పదుకోన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కలకత్తాలో జరుగుతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రజినీకాంత్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దేసింగు పెరియస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

గతంలో ఈయన తెరకెక్కించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు రజినికాంత్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. గాథలో దీపికా.. రజినీకాంత్ తో కలిసి ‘కొచ్చడయాన్’ అనే సినిమా చేసింది. అయితే ఇది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేటెడ్ క్యారెక్టర్స్ గా రూపొందించారు.

కానీ ఈసారి నిజంగానే వెండితెరపై వీరి కాంబినేషన్ ను చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం దీపికా ‘పఠాన్’ సినిమాతో పాటు శకున్ బత్రా సినిమా కూడా చేస్తోంది. అలానే ప్రభాస్ సినిమా లైన్లో ఉంది. ఇలాంటి సమయంలో రజినీకాంత్ కు డేట్స్ ఇస్తుందా అనేది ప్రశ్న. మరి ఈ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus