ఈసారి చిరంజీవే రికమెండ్‌ చేశారట

చిరంజీవి – దేవిశ్రీప్రసాద్‌ది హిట్‌ కాంబినేషన్‌. వారి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాల ఫలితం కాస్త అటు ఇటు అయి ఉండొచ్చు కానీ, పాటలు మాత్రం ప్రతిసారి అదరగొట్టేశాయి. అయితే మణిశర్మ, కాదంటే దేవిశ్రీప్రసాద్‌ అన్నట్లుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మారింది. చిరంజీవి రీ ఎంట్రీ ‘ఖైదీ నెం 150’కి మ్యూజిక్‌ ఇచ్చిన డీఎస్పీ, అంతకుముందు సినిమా ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’కి మ్యూజిక్‌ ఇచ్చాడు. ‘లూసిఫర్‌’ రీమేక్‌కి తమన్‌ను ఎంచుకున్నారు. దీంతో చిరు – డీఎస్పీ కాంబోని మిస్‌ అవుతున్న వారికి గుడ్‌ న్యూస్‌.

చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌ను ఎంచుకున్నారట. ఆ ఆలోచన చేసింది చిరంజీవి కావడం గమనార్హం. దేవిశ్రీప్రసాద్‌ను చిరంజీవి చాలా రోజులుగా దూరం పెడుతున్నారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ వార్తలకు తగ్గట్టే ఆ మధ్య రామ్‌చరణ్‌ సినిమాలకు దేవి మ్యూజిక్‌ చేయలేదు. ఇప్పుడు ఆ వార్తలకు స్టాప్‌ పడుతుందేమో చూడాలి.

చిరంజీవి సినిమాలకు సంగీతం అందించకపోయినా, మిగిలిన మెగా హీరోలకు సంగీతం ఇస్తూనే ఉన్నాడు. ఎంతమంది మెగా హీరోలతో పని చేసినా, మెగాస్టార్‌కి పని చేయడం ఎప్పుడూ కిక్కే. మొన్న జరిగిన ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దేవిని చిరు మెచ్చుకున్నాడు కూడా. ఆ స్టేజీ మీద ఇద్దరినీ చూసి.. కలసి పని చేస్తే బాగుండు, హిట్‌ మ్యూజిక్‌ మరొకటి ఇస్తే బాగుండు అని అనుకున్నారు. తథాస్తు దేవతలు ఉంటారు అంటారు కదా.. ‘ఊ’ అనేశారేమో బాబీ సినిమాతో వస్తున్నాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus