Hero Nani: బిగ్ బాస్ లోకి మళ్ళీ నాని

టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 మొత్తానికి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టాప్ ఫైవ్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్స్ లు ఎవరికి వారు తామే టైటిల్ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ లేకపోయినప్పటికీ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అతిథులుగా వచ్చే సెలబ్రిటీస్ ఎవరు అనే విషయం లో చాలా రకాల సందేహాలు వెలువడుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా బిగ్ బస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ పై మంచి క్రేజ్ ఏర్పడుతోంది.

ఈ సారి కూడా రేటింగ్స్ విషయంలో బిగ్ బస్ నిర్వాహకులను చాలా సంతృప్తిపరచినట్లుగా టాక్ వస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా ఉన్న నాని మళ్లీ చాలా కాలం తర్వాత బిగ్ బస్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ సీజన్ పూర్తయిన తర్వాత నాని మళ్లీ అలాంటి రియాల్టీ షో తాను చేయలేను అని చాలా ఒత్తిడితో కూడుకున్న పని అంటూ ఓపెన్ గా తెలియజేశాడు.

ఇక మళ్ళీ చాలా కాలం తరువాత బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున తో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాని మాత్రమే కాకుండా సినిమాలో నటించిన హీరోయిన్స్ సాయి పల్లవి కీర్తి సురేష్ కూడా సందడి చేయబోతున్నట్లు సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని నాని ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నాడు. ఇక తెలుగులో బిగ్ బాస్ షో ద్వారా కూడా జనాల్లోకి సినిమాను వెళ్ళేలా చేస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి బాక్సాఫీసు వద్ద సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus