ఎన్టీఆర్, లక్మి ప్రణతి కు మళ్ళీ అబ్బాయ్ పుట్టాడు..!

  • June 14, 2018 / 08:28 AM IST

మొన్నీ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టింది అనే వార్త సోషల్ మీడియాలో వీర విహారం చేసింది. ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతికి మొదట అబ్బాయి అభయ్ రామ్ కాగా.. రెండోసారి అమ్మాయి పుట్టిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఖండించారు. ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టలేదని.. అసలు ఇంకా డెలివరీ అవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ మరోమారు తండ్రయ్యాడు. రెండోసారి ఆ దంపతులకి బాబు పుట్టాడు. తనకి బాబు పుట్టాడు అనే విషయాన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన అభిమానులకు చేరవేసాడు. The family grows bigger. It’s a BOY! (కుటుంబం పెద్దది అయ్యింది…) అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus