నాని సినిమా ఎన్టీఆర్ కొంపముంచింది..!

జూ.ఎన్టీఆర్ ఇప్పుడు అందరి హీరోల తోనూ మంచి స్నేహంగా ఉంటున్నాడు.. ఒక్క తన బాబాయ్ నందమూరి బాలకృష్ణతో తప్ప’ … ఇది నందమూరి అభిమానుల్లో ఉన్న పెద్ద సందేహం. దీనికి తగిన కారణాలు కూడా వారి దగ్గరున్నాయి. ఏదో హరికృష్ణ చనిపోవడం వలన ఏదో ఫార్మాలిటీ గా బాలయ్యతో పలు సందర్భాల్లో కనిపించాడే తప్ప.. పూర్తిగా కలవలేదు అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య ‘ఎన్టీఆర్ కథనాయకుడు’ ప్రీ రిలీజ్ వేడుకకి ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. స్వయంగా తన తోనే ట్రైలర్ ను లాంచ్ చేయించాడు. దీంతో ఏదో తప్పదు అన్నట్టు ఎన్టీఆర్ ఆ ట్రైలర్ గురించి స్పందించాడు తప్ప.. మనస్పూర్తిగా మాట్లాడలేదనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు.

తాజాగా విడుదలైన నాని ‘జెర్సీ’ చిత్రాన్ని నాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు.అంతే కాదు ఈ చిత్రాన్ని, నాని నటనని ఓ రేంజ్లో పొగిడేసాడు. ఇప్పుడు ఇదే విషయం పై కొందరు నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. ‘అప్పట్లో ఒక్కో సినిమాలోనూ పది సార్లు తాత పేరు.. బాబాయ్ పేరు చెప్పుకుని పైకొచ్చావ్. ఇప్పుడు వాళ్ళు పెద్ద భారమైపోయారా… ‘ఎన్టీఆర్ బయోపిక్’ పై ఏమాత్రం స్పందించని నువ్వు ‘జెర్సీ’ చిత్రాన్ని మాత్రం ఆకాశాన్నెత్తేసావ్. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ వేడుకకి వెళ్ళావ్. అలాంటిది నీ బాబాయ్ సినిమా అంటే లెక్కలేదా’ అంటూ ఎన్టీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ఏదేమైనా నాని సినిమా పై స్పందించడం ఎన్టీఆర్ కి లేని పోనీ సమస్య తెచ్చిపెట్టిందని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus