Jr NTR: సేమ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న తారక్‌… ఈసారి ఏమవుతుందో?

‘స్టూడెంట్ నెం.1’తో హీరోగా మంచి మార్కులు వేయించుకున్న ఎన్టీఆర్‌… ‘ఆది’తో స్టార్‌ హీరో అయిపోయాడు. ఇక తారక్‌కి ఎదురు లేదు అనుకుంటున్న సమయంలో సెలక్షన్‌ మిస్టేక్స్‌తో వరుసగా పరాజయాలు చవి చూశాడు. ఆ ఫేజ్‌లో చేసిన ఓ మిస్టేక్‌ ‘నాగ’. వయసుకు మించి పాత్ర ఆ సినిమాలో చేశాడు అని టాలీవుడ్‌ పరిశీలకులు చెబుతూ ఉంటారు. విద్యార్థి నాయకుడు, ఆ తర్వాత రాజకీయాలు, సీఎం పదవి అంటూ… సినిమా ఓ హై ఓల్టేజ్‌లో సాగిపోతూ ఉంటుంది.

తారక్‌ నుండి అంతటి బరువైన పాత్ర, సినిమా చూడలేకపోయారు అభిమానులు. దీంతో ‘నాగ’ సినిమా తారక్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. సినిమా పాయింట్‌, తెరకెక్కించిన విధానం మంచిగానే ఉన్నా… ఆ టైమ్‌కి అది కరెక్ట్‌ కాదు అని అంటుంటారు. ఆ తర్వాత మరోసారి తారక్‌ విద్యార్థి నాయకుడు అనే కాన్సెప్ట్‌కి పోలేదు. ‘జనతా గ్యారేజ్‌’లో విద్యార్థిగా కనిపిస్తాడు తప్ప. నాయకుడు అనే మాట ఎక్కడా వినిపించదు. అయితే ఇన్నాళ్లకు అంటే 19 ఏళ్లకు ఇప్పడు మళ్లీ విద్యార్థి నాయకుడు అనే మాట వినిపిస్తోంది.

దీంతో అభిమానులకు ఓవైపు భయం, మరోవైపు ఆనందం వేస్తున్నాయట. భయం ఏంటి అనేది తర్వాత చూద్దాం… ముందు ఆనందం సంగతి చూద్దాం. స్టార్‌ హీరోగా గుర్తింపు అప్పుడే వచ్చిన రోజులవివి. దాంతో ‘నాగ’ లాంటి సినిమా ఎన్టీఆర్‌ అప్పుడే హ్యాండిల్‌ చేయలేకపోయాడు అని అంటుంటారు అభిమానులు. ఇప్పుడు తారక్‌కి అన్ని విషయాల మీద పట్టుంది. ఇప్పుడు అలాంటి నాయకుడు సినిమాలు వస్తే బాగుంటుంది అని వారి ఉద్దేశం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ కూడా ఉన్న వ్యక్తి తారక్‌ కావడంతో…

ఒకే దెబ్బకు రెండు పిట్లు అని చూస్తున్నారు. ఇక భయం సంగతి చూస్తే… ముందు అనుకున్నదే. అప్పుడు వచ్చిన ఫలితం ఇప్పుడూ వస్తే, ఎన్టీఆర్‌కు నాయకుడు పాత్రలు నప్పవు అనే పేరొచ్చేస్తుంది. అది కూడా రెండు రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఇటు సినిమాల్లోనూ, అటు పొలిటికల్‌గానూ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కాబట్టి కొరటాల శివ ఈ సినిమాపై డబుల్‌ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చూద్దాం ఏమవుతుందో?

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus