‘సోగ్గాడే చిన్ని నాయన’ ( Soggade Chinni Nayana) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna). 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. దీంతో అతను స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చినట్టు అయ్యింది. దీంతో వెంటనే నాగార్జున (Nagarjuna) ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అలా నాగ చైతన్యతో (Naga Chaitanya) ‘రారండోయ్ వేడుక చూద్దాం’ (Rarandoi Veduka Chudham) చేసే అవకాశం దక్కించుకున్నాడు. అది కూడా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్..లో చేరిపోయాడు.
అయితే అటు తర్వాత రవితేజతో (Ravi Teja) చేసిన ‘నేల టిక్కెట్టు’ (Nela Ticket) ప్లాప్ అయ్యింది. మరోపక్క అతని పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ నాగార్జున ‘బంగార్రాజు’ (Bangarraju) చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా బాగానే ఆడింది. 2022 సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ ఒక్క సినిమా కూడా చేయలేదు. మధ్యలో చిరంజీవితో (Chiranjeevi) ఒక సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకున్నారు.
కానీ ఆ ప్రాజెక్టు కూడా వర్కౌట్ కాలేదు. అటు తర్వాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) నిర్మాణంలో ఓ సినిమా ఫిక్స్ అన్నారు. అందులో కార్తీ హీరోగా చేసే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా వర్కౌట్ కాలేదు. జ్ఞానవేల్ రాజా కూడా ‘కంగువా’ (Kanguva) నష్టాల వల్ల ఇప్పట్లో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో కళ్యాణ్ కృష్ణకి ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది.
దీంతో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున చుట్టూ తిరుగుతున్నాడట.నాగార్జున కూడా కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నారు. ఒకటి రెండు కథలు ఓకే చేశారు. అందులో ఒకటి సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.