Kalyan Ram, Anil Ravipudi: అనిల్ రావిపూడి ఆ రుణాన్ని తీర్చేసుకుంటారా?

కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో పటాస్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పటాస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అనిల్ రావిపూడికి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ అనిల్ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click Here To Watch

ప్రస్తుతం ఎఫ్3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాస్ సినిమా తర్వాత తన డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమా తెరకెక్కాల్సి ఉందని సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో కళ్యాణ్ రామ్ కు ఒక కథ కూడా చెప్పానని అనిల్ అన్నారు. కథ కళ్యాణ్ రామ్ కు నచ్చినా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

తాను కళ్యాణ్ రామ్ పటాస్2 చేయాలని అనుకున్నామని మంచి స్లాట్ చూసుకుని సినిమాను ప్లాన్ చేస్తామని అనిల్ వెల్లడించారు. పటాస్ సినిమా రిలీజైన తర్వాత భారీ స్థాయిలో సక్సెస్ సాధించిందని అనిల్ రావిపూడి అన్నారు. పటాస్ సక్సెస్ టూర్ సమయంలో తాను, కళ్యాణ్ రామ్ మరింత కలిసిపోయామని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమ మధ్య బాండింగ్ అలానే ఉందని అనిల్ అన్నారు. కళ్యాణ్ రామ్ మ్యారేజ్ డే రోజున కాల్ చేసి తాను మాట్లాడానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

కళ్యాణ్ రామ్ కు తనకు మధ్య ఉన్న అనుబంధం పోదని అనిల్ వెల్లడించారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ హోదాను అనుభవించడానికి ఒక విధంగా కళ్యాణ్ రామ్ కారణమనే సంగతి తెలిసిందే. పటాస్2 సినిమాతో అనిల్ రావిపూడి ఆ రుణాన్ని తీర్చుకుంటారేమో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus