Kamal Haasan: ఆసుపత్రిలో చేరిన కమల్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
- January 17, 2022 / 07:38 PM ISTByFilmy Focus
ఇండియా వైడ్ కరోనా ఉధృతి ఎక్కువైంది. రోజూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది.సంక్రాంతి పండుగ కారణంగా జనాలు విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఆంక్షలు విధించడం లేదు. థర్డ్ వేవ్ మొదలైందని సంకేతాలు అందుతున్నప్పటికీ.. ఇంకా జనాల్లో ఎటువంటి టెన్షన్ కనిపించడం లేదు. అటు సెలబ్రిటీలు సైతం వరుసగా కరోనా భారిన పడుతుండడం గమనార్హం. ఇప్పటికే కమల్ హాసన్,వడివేలు, నటి వరలక్ష్మి శరత్ కుమార్,కీర్తిసురేష్, త్రిష,మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు.

అయితే కమల్ హాసన్ గత నెలలో చాలా రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్నారు. ‘బిగ్ బాస్5’ ఫినాలే కి ఆయన కోలుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ఇప్పుడు ఈ విషయం పై అక్కడి జనాలు మరియు కమల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.’ఒక వేళ కమల్ మళ్ళీ కరోనా భారిన పడ్డారా? ఆయన ఆరోగ్యం క్షీణించిందా? ‘ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అయితే కంగారు పడాల్సిన పనేమీ లేదు. కమల్ రెగ్యులర్ హెల్త్ చెకప్ రీత్యా మాత్రమే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారట. మరికొన్ని గంటల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారట. ఈ సమాచారాన్ని చెన్నై మీడియా వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం కమల్.. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రం చేస్తున్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ కూడా ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంది.
2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!













