చిరు 152వ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా..?

చిరంజీవి తన152వ చిత్రం టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి స్టార్ హీరోలను ఓ రేంజ్ లో ప్రజెంట్ చేయడంలో కొరటాల శివ పెద్ద దిట్ట. చిరంజీవి కోసం కూడా అలాంటి తరహాలోనే ఓ బెస్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఈ సినిమా కొరకు కొరటాల ఏడాదికి పైగా ఎదురుచూశారు. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తున్నారు. సినిమాలో కీలకమైన కొన్ని ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ కనిపిస్తారట. ఐతే ఆ పాత్రకు ఓ హీరోయిన్ ని కూడా కొరటాల సిద్ధం చేస్తున్నారనే…ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

గత ఏడాది రామ్ చరణ్ సంక్రాంతి చిత్రం వినయ విధేయ రామ లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ ని కొరటాల, చరణ్ కి జంటగా తెచ్చే ఆలోచనలో ఉన్నారట. ఆమెతో సంప్రదింపులు జరపనున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కియారా తక్కువ నిడివి గల పాత్రకు ఒప్పుకుంటుందా అనేది చూడాలి.కొరటాల మహేష్ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను చిత్రంలో కియారా హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించడం విశేషం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus