‘సరిలేరు నీకెవ్వరు’.. ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా శనివారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిందని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు ‘సరిలేరు నీకెవ్వరు’ యూఎస్ ప్రీమియర్స్ ద్వారా 620,000 లక్షల డాలర్లు వసూలు చేసింది.
ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా వన్ మిలియన్ వసూళ్లకు చేరువవ్వడం ఖాయమని చెబుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus