మళ్ళీ చైతన్య రిస్క్ చెయ్యడానికి రెడీ అయ్యాడే..!

ఎందుకో నాగ చైతన్యను ఎక్కువగా లవర్ బాయ్ గా.. లేదా ఫ్యామిలీ హీరోగా చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ మన చైతన్య మాత్రం యాక్షన్ సబ్జెక్టులు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అలాంటి సినిమాలు చేసిన ప్రతీసారి చైతన్యకు చేదు అనుభవమే ఎదురయ్యింది. అయినప్పటికీ ఓ పక్క సేఫ్ గేమ్ గా లవర్ బాయ్ లేదా ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తూనే మరోపక్క యాక్షన్ సినిమాలు చేస్తూ ఉంటాడు మన చైతన్య.

ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ ‘థాంక్యూ’ వంటి క్లాస్ సినిమాలు చేస్తున్న నాగ చైతన్య ఆ తరువాత తనకి కలిసి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓ యాక్షన్ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. వివరాల్లోకి వెళితే..నాగ చైతన్య .. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నాడని టాక్. ఈ మధ్యనే తరుణ్ వినిపించిన స్క్రిప్ట్ నాగ చైతన్యకు నచ్చడంతో ఈ ప్రాజెక్టుకి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.

అతి త్వరలో ఈ ప్రాజెక్టు పై క్లారీటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు చైతన్య. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా సరే మళ్ళీ అలాంటి పాత్రనే చైతన్య చెయ్యడానికి రెడీ అవుతుండడంతో రిస్క్ చేస్తున్నాడని డిస్కషన్లు జరుగుతున్నాయి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus