Nidhhi Agerwal: లింగుస్వామి సినిమాలో ఇద్దరు నాయికలతో రామ్‌ రొమాన్స్‌

రామ్‌ పోతినేని – లింగుస్వామి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పరిస్థితులు బాగుంటే ఈపాటికి సినిమా చిత్రీకరణ మొదలయ్యేదేమో. అయితే కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే చిత్రబృందం ఈలోపు మిగిలిన పనులు పూర్తి చేసుకుంటోంది. ప్రీ ప్రొడక్షన్‌, కాస్ట్‌ అండ్‌ క్రూ సెలక్షన్‌ పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో హీరోయిన్ల ఎంపిక పూర్తయిందని తెలుస్తోంది. రామ్‌ – లింగుస్వామి సినిమాలో కథానాయికగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని తీసుకున్నట్లు గతంలో తెలిపారు.

అయితే ఇప్పుడు మరో నాయికను కూడా ఓకే చేశారని టాక్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో టాలీవుడ్‌ను తనవైపు తిప్పుకున్న నిధి అగర్వాల్‌ను ఎంపిక చేశారట. అంటే రామ్‌తో నిధి రెండోసారి నటించబోతోంది అన్నమాట. ఇందులో కూడా నిధి పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. రామ్‌ కోసం లింగుస్వామి మాస్‌ మసాలా కథను సిద్ధం చేశారని టాక్‌. మరోవైపు దేవిశ్రీప్రసాద్‌ తనదైన శైలిలో సంగీతం సిద్ధం చేస్తున్నారట. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక సినిమాను మొదలుపెట్టి నాన్‌స్టాప్‌గా కొనసాగించి ముగిస్తారట.

దాని వల్ల ఈ గ్యాప్‌ను కవర్‌ చేసుకోవచ్చని చిత్రబృందం భావిస్తోంది. ఎస్‌ఎస్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్న అన్నట్లు లింగుస్వామి ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది. మరి ఈ మెమొరబుల్‌ ఇయర్‌లో మెమొరబుల్‌ మూవీ ఇవ్వాలని ఆశిద్దాం.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus