Mahesh Babu: మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) కి మరోసారి ఈడీ నోటీసులు అందడం కలకలం సృష్టించింది.సాయి సూర్య డెవలపర్స్‌ అనే సంస్థకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది. దీని ప్రచారంలో భాగంగా కొంత బ్లాక్ మనీ అందుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించి మహేష్ బాబు (Mahesh Babu) కి ఈడీ నోటీసులు పంపడం జరిగింది. విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నట్లు కూడా ప్రచారం జరిగింది.

Mahesh Babu

అయితే దీనిపై మహేష్ బాబు (Mahesh Babu) లీగల్ టీం ఏం చేసింది అనేది.. అతని టీం మీడియాకి సమాచారం ఇచ్చింది లేదు. తర్వాత దాని గురించి చప్పుడు కూడా లేదు. అయితే ఇప్పుడు మహేష్ కు మరోసారి నోటీసులు అందడంతో చర్చనీయాంశం అయ్యింది. సాయి సూర్య డెవలపర్స్‌ లో ప్లాట్ కొని మోసపోయిన ఓ డాక్టర్, అలాగే మరో వ్యక్తి కలిసి ఈ మేరకు కన్జ్యుమర్ కమిషన్‌..లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇందులో సంస్థ పేరుని, యజమాని సతీష్ పేరుని, బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు (Mahesh Babu) పేరుని ప్రతివాదుల లిస్ట్ లో చేర్చినట్టు సమాచారం. రూ.33 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకోవాలన్న ఓ డాక్టర్ కి… అన్ని రకాల వసతులు, అనుమతులతో కూడిన ప్లాట్ ఇస్తున్నట్టు చెప్పి.. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బ్రోచర్‌..ను వారికి ఇచ్చారట.

కానీ అక్కడ ప్లాట్ లేదట, దీంతో డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయగా రూ.15 లక్షలు వెనక్కి ఇచ్చారట. మిగిలిన అమౌంట్ కోసం సంప్రదిస్తుంటే ఫోన్లు లిఫ్ట్ చేయకుండా తిరుగుతున్నారట సాయి సూర్య డెవలపర్స్. అందుకే వారు రంగారెడ్డి జిల్లా, కన్జ్యుమర్ కమిషన్‌..లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈసారైనా మహేష్ బాబు లీగల్ టీం లేదా అతని టీం ఈ విషయం పై రెస్పాండ్ అవుతుందేమో చూడాలి.

కమల్ హాసన్ కి నెటిజన్ల సలహా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus