Poonam Kaur: మళ్ళీ త్రివిక్రమ్ ని తగులుకున్న పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ (Poonam Kaur) .. కొన్నేళ్ల నుండి పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram) ను ఛాన్స్ దొరికిన ప్రతిసారి టార్గెట్ చేస్తూ వస్తోంది. గతేడాది వరకు.. ఎక్కువగా ఆమె ఫోకస్ పవన్ కళ్యాణ్ పైనే ఉండేది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, అతని రాజకీయ ప్రయాణం గురించి ఆమె పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేసేది. ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసినా.. తగ్గేది కాదు. అయితే కొద్ది రోజుల క్రితం ఏమైందో తెలీదు.. ‘పవన్ కళ్యాణ్ గురించి నేనెప్పుడూ ఏమీ అనలేదు.

Poonam Kaur

నేను వేరే స్టార్ హీరోని అతని రాజకీయ ప్రయాణాన్ని వర్ణిస్తూ నా అసహనాన్ని తెలిపాను’ అన్నట్టు చెప్పుకొచ్చింది. సో పవన్ కళ్యాణ్ ని ఆమె లైట్ తీసుకున్నట్లు అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. కానీ అప్పటి నుండి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఆమె డైరెక్ట్ గా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ‘ఛాన్సులు ఇస్తానని చెప్పి నన్ను వాడుకున్నాడు’ అన్నట్టు త్రివిక్రమ్ పై ఆమె నెగిటివ్ కామెంట్లు చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

జానీ మాస్టర్ అరెస్ట్ టైంలో కూడా ‘నేను త్రివిక్రమ్ పై కంప్లైంట్ ఇస్తే ‘మా’ ఎందుకు స్వీకరించలేదు?’ అంటూ ఆమె ప్రశ్నించింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘తాను నిర్మించిన సినిమాలోని 3 సెకన్ల వీడియో క్లిప్ ను నయనతార తన పెళ్లి కార్యక్రమం వీడియోలో వాడుకుంది. దాన్ని నెట్ ఫ్లిక్స్ లో కూడా వాడుతున్నట్టు’ ఆరోపిస్తూ నయన్ పై రూ.10 కోట్ల దావా వేశాడు.

దీంతో నయన్ కూడా ‘నీ క్యారెక్టర్ ఎలాంటిదో బయట పెడతా’ అన్నట్టు కౌంటర్ ఇచ్చింది. ఈ గొడవల్లోకి త్రివిక్రమ్ పేరును వాడుతూ ‘త్రివిక్రమ్ కాపీ కేసుల సంగతేంటి?’ అంటూ కౌంటర్ వేసింది. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాపై ‘ది లార్గో వించ్’ దర్శకుడు కేసు వేసిన సంగతి తెలిసిందే. దాని గురించే పూనమ్ కౌంటర్ వేసింది అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus