Rahul Ravindran: రాహుల్‌ రవీంద్రన్‌ ఈసారి ఏం చేస్తాడో

నాగార్జునకు ఫలితం మీద కన్నా దర్శకుడి పనితనం మీద నమ్మకం ఎక్కువ అంటుంటారు. అందుకే గతంలో ఫ్లాప్‌ సినిమా ఇచ్చినా ఆ దర్శకుడి అవకాశం ఇవ్వడానికి వెనుకాడరు అంటుంటారు. అయితే ఇటీవల కాలంలో నాగ్‌ ఇలాంటి డేర్‌ స్టెప్‌ తీసుకోలేదు. కానీ రాహుల్‌ రవీంద్రన్‌ కోసం ఆ పని చేస్తున్నారని టాక్‌. ‘మన్మథుడు 2’ లాంటి డిజాస్టర్‌ ఇచ్చిన రాహుల్‌కు నాగ్‌ మరో ఛాన్స్‌ ఇస్తున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రాహుల్‌ ఓ సినిమా చేస్తున్నాడట.

నాగార్జున అవకాశం ఇస్తున్నాడు అంటే… తనను డైరెక్ట్‌ చేయడానికి అనుకునేరు. చాలా రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున సినిమాలు చేయడం లేదు. గతంలో వరుసగా సినిమాలు వచ్చేవి. దీంతో మరోసారి కుర్రహీరోలతో సినిమాలు చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. అందులో ఓ ప్రాజెక్టుగా రాహుల్‌ రవీంద్రన్‌ సినిమా ఉంటుందట. దీనికి సంబంధించి రాహుల్ మంచి కథలు సిద్ధం చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఇక్కడో మరో మాట కూడా వినిపిస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ఓ ఓటీటీ వస్తుందని గతంలో వార్తలొచ్చాయి. దీంతో ఆ ఓటీటీ కోసం ఏమన్నా రాహుల్‌తో సిరీస్‌, వెబ్‌ ఫిల్మ్‌ తీయబోతున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఓటీటీ సంగతే ఇంకా బయటకు రాలేదు కాబట్టి… ఈలోపు సిరీస్‌/వెబ్‌ ఫిల్మ్‌ తీసి వేరే ఓటీటీకి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నాగార్జున ఎంత పెద్ద హీరో, అంత పెద్ద బిజినెస్‌ మైండ్‌ కూడా. ఓటీటీ ట్రెండ్‌ నడుస్తున్న ఈ రోజుల్లో అలానే ఆలోచిస్తారు మరి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus