Rajinikanth: నెల్సన్ డైరెక్షన్ లో మరోసారి రిపీట్ కానున్న హిట్ ఫెయిర్!

సుమారు 12 సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య నటించిన చిత్రం రోబో. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇలా రోబో సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా చేయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే మరోసారి ఈ హిట్ కాంబినేషన్ ను నెల్సన్ దిలీప్ కుమార్ వెండితెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

నెల్సన్ కామెడీ నేపథ్యంలో పలు చిత్రాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బీస్ట్ సినిమాపైభారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో రజనీకాంత్ సినిమా ఉండదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తూ నెల్సన్ దర్శకత్వంలో రజనీ సినిమాను ఉంటుందని ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో రజనీకాంత్ ఐశ్వర్య భార్యాభర్తలుగా సందడి చేయనున్నట్లు సమాచారం.ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏ జానర్లో ఉంటుందో తెలియక పోయినప్పటికీ ఈ కాంబినేషన్లో సినిమా అంటేనే ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే రమ్యకృష్ణ నరసింహ చిత్రంలో రజనీకాంత్ కు పోటీగా నటించి అందరిని మెప్పించారు.

ఈ క్రమంలోనే రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించబోతోందని తెలియడంతో ఈమె ఎలాంటి పాత్రలో సందడి చేయనుందనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus