Rana Daggubati: ఘాజి డైరెక్టర్ తో మరోసారి రానా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల కాలంలో మళ్ళీ కాస్త వెనుకబడ్డాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే అతను సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు లభించింది అనే చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో భీమ్లా నాయక్ సినిమాతో మళ్లీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని కూడా చెప్పవచ్చు. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ చాలా డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు.

Click Here To Watch

ఒక మంచి హీరోగా కంటే కూడా అతనిలో ఒక మంచి నటుడు ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక రానా దగ్గుబాటి గతంలో ఘాజి సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మళ్ళీ చాలాకాలం తరువాత ఈ హీరో ఘాజి దర్శకుడితో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా గత కొంత కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు.

అతని రెండవ సినిమా అంతరిక్షం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పిట్టకథలు వెబ్ సిరీస్ లో ఒక వెర్షన్ కు దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అందుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అతను ఒక హిందీ సినిమాను లైన్ లో పెట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే సంకల్ప్ రెడ్డి రానా దగ్గుబాటితో కూడా మరోసారి సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట.

ఘాజి సినిమా తర్వాత రానా మళ్లీ అలాంటి సోలో సక్సెస్ ను అందుకోలేదు. అందుకే మరోసారి సంకల్ప్ రెడ్డి తో చర్చలకు దిగినట్లు సమాచారం ఇక ప్రస్తుతం రానా దగ్గుబాటి రానా నాయక్ సినిమా తో పాటు విరాట పర్వం సినిమా కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా అతని లిస్టులో ఉన్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus