Ravi Teja, Anil Ravipudi: ఆ రీమేక్ కోసం అనిల్ రావిపూడి పని చేస్తున్నారా?

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే రవితేజ హీరోగా రానా నిర్మాతగా తెలుగులో మానాడు రీమేక్ తెరకెక్కనుంది. తమిళంలో మానాడు సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారని సమాచారం అందుతోంది. రానాతో పాటు ఆసియన్ సునీల్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని బోగట్టా. ఈ సినిమా తెలుగులో కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా రానా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కామెడీ ట్రాక్ ను మరింత ఇంప్రూవ్ చేయడానికి రానా అనిల్ రావిపూడి సాయం కోరారని అనిల్ రావిపూడి అందుకు అంగీకరించారని బోగట్టా.

ధమాకా మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే రవితేజ ఈ సినిమాను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రవితేజ మెయిన్ హీరో కాగా సిద్ధు జొన్నలగడ్డ మరో కీలక పాత్రలో నటించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అతి త్వరలో మానాడు రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. స్టార్ హీరో రవితేజ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో తర్వాత సినిమాలపైనే రవితేజ ఆశలు పెట్టుకున్నారు. రవితేజ సినిమాకు అనిల్ రావిపూడి రచయితగా పని చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వరుసగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి తర్వాత సినిమాను బాలయ్య హీరోగా తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus