వంద కోట్ల కాంబోలో మరో సినిమా..!

త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao).. ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒకడు. ‘నేను లోకల్’ (Nenu Local)  ‘సినిమా చూపిస్తా మావ’ ‘ధమాకా'(Dhamaka) వంటి హిట్లతో త్రినాథ్ రావ్ నక్కిన రేంజ్ పెరిగింది. ముఖ్యంగా ‘ధమాకా’తో వంద కోట్ల దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇతనితో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్ లోనే కాదు నిర్మాతల్లో, హీరోల్లో కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పట్లో ఇతనికి స్టార్ హీరోలు దొరికే అవకాశం లేదు.

Ravi Teja:

అందుకే యంగ్ హీరోలు లేదా మిడ్ రేంజ్ హీరోలతో ముందుకు వెళ్తున్నాడు. సందీప్ కిషన్ తో (Sundeep Kishan)  ఇతను ‘మజాకా’ అనే సినిమా చేశాడు. ఫిబ్రవరి 26న అది ప్రేక్షకుల ముందుకు రానుంది. దానిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి త్రినాధ్ తర్వాతి సినిమా సంగతేంటి? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అందుకు సమాధానంగా రవితేజ  (Ravi Teja) పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్లో ‘ధమాకా’ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది.

కాబట్టి ట్రేడ్లో మంచి అంచనాలు ఉంటాయి. మరోవైపు రవితేజ (Ravi Teja)  ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత మరో సినిమాకి కమిట్ అవ్వలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం రవితేజ 2,3 కథలు ఓకే చేశాడు. అవి కూడా కొత్త దర్శకులతోనే..! కానీ రవితేజతో సినిమాలు చేయడానికి ప్రస్తుతం నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే అతని పారితోషికం దాదాపు రూ.30 కోట్లు ఉంటుంది. సినిమా బడ్జెట్ రూ.50 కోట్ల వరకు పెట్టాలి.

చివరికి అది ఎంతవరకు అయినా వెళ్లొచ్చు. ఒకవేళ పర్వాలేదు అని పెట్టినా.. అతని సినిమాలకి ఓటీటీ బిజినెస్ జరగడం లేదు. అందుకే కేవలం రవితేజని నమ్మి నిర్మాతలు ముందుకు రావడం లేదు. కానీ త్రినాథ్ రావ్ నక్కిన వంటి మినిమమ్ గ్యారంటీ దర్శకుడితో రవితేజ సినిమా కమిట్ అయితే.. కాంబినేషనల్ క్రేజ్ తో నిర్మాతలు ముందుకు వస్తారు. అందుకే రవితేజ కూడా త్రినాథ్ రావ్ నక్కినతో సినిమా చేయడానికి రెడీ అయినట్టు స్పష్టమవుతుంది.

‘మ్యాడ్’ కి మించిన ఫన్ గ్యారెంటీనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus